వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
ఈ ఎపిసోడ్లో, డాక్టర్ విల్ టటిల్ (వీగన్) ఆత్మీయంగా పరిచయం చేస్తున్నారు సుప్రీమ్ మాస్టర్ చింగ్ హై మరియు కార్యకర్త హోవార్డ్ లైమన్ (వీగన్) పశువుల పెంపకందారుడి నుండి వీగన్ ప్రచారకుడిగా మారిన తన ప్రయాణాన్ని పంచుకోవడం ప్రారంభించారు. Dr. Will: నా పుస్తకం, “ది వరల్డ్ పీస్ డైట్”లో నేను ప్రస్తావించినట్లుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుప్రీమ్ మాస్టర్ చింగ్ హై అనుచరులు అనేక నగరాల్లో వీగన్ రెస్టారెంట్లను ఏర్పాటు చేసి, ప్రపంచంలోని వివిధ దేశాలలో విపత్తు బాధితులు, ఖైదీలు, పిల్లలు మరియు వృద్ధులకు వీగన్ దుస్తులు, ఆహారం, ఆశ్రయం మరియు సహాయాన్ని అందిస్తున్నారు. ఆమె తన విద్యార్థులను రోజుకు రెండున్నర గంటలపాటు ధ్యానం చేయాలని, మాంసం, (డైరీ)పాల ఉత్పత్తులు లేదా గుడ్డు ఉత్పత్తులను తినకూడదని, మద్యం మరియు వైద్యులు సూచించని మందులకు దూరంగా ఉండాలని, జంతువులు లేదా ప్రజల దోపిడీని ప్రోత్సహించే ఉద్యోగాలలో పని చేయకూడదని ప్రతిజ్ఞ చేయాలని నిర్దేశించినప్పటికీ, ఆమె ఉద్యమం విస్తరిస్తూనే ఉంది. ఆమె ఉద్యమానికి ఆటంకం కలిగించకపోగా, తన విద్యార్థులు తమ భోజనంలో క్రూరత్వాన్ని తగ్గించుకోవాలని ఆమె పట్టుబట్టడం విరుద్ధంగా దానిని ప్రోత్సహించవచ్చు. ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల శ్రద్ధ ఉన్నవారు తమ జీవితాల్లో మౌలికమైన మార్పును స్వీకరించగలరని, బహుశా ఆ అవకాశాన్ని స్వాగతిస్తారని కూడా స్పష్టమవుతోంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ సర్వోన్నత గురువు చింగ్ హై పట్ల మరియు ఆమె విద్యార్థుల పట్ల కూడా కృతజ్ఞతా రుణపడి ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎక్కడైనా చూపించే దయ ప్రతిచోటా ప్రతి ఒక్కరినీ ఆశీర్వదిస్తుంది – మనమందరం ఒకరికొకరు అనుసంధానించబడి ఉన్నాము. ప్రపంచాన్ని ఆశీర్వదించాలనే ఆమె ప్రయత్నాలు, ఆమె ఉద్దేశాల స్వచ్ఛత వల్ల మరింతగా వృద్ధి చెందుతాయి, తద్వారా ఈ చిన్నారి మహిళ యొక్క కృషి ప్రభావం అత్యంత అపారంగా ఉంటుంది. జంతువులు మరియు భూమి కోసం మనం చేసే వాదనలో మరింత ప్రభావవంతంగా ఉండటానికి సహాయపడే ఉత్తమ వ్యూహాలు మరియు పద్ధతులు ఏమిటని ప్రజలు నన్ను తరచుగా అడుగుతుంటారు. సమస్యల గురించి మనకు మనం అవగాహన కల్పించుకోవడంతో పాటు, జంతు విముక్తి ఉద్యమానికి మనం చేయగల అత్యంత ముఖ్యమైన తోడ్పాటు ఏమిటంటే, మనకోసం మనం నిజమైన ఆధ్యాత్మిక విముక్తిని కోరుకోవడం, మరియు శాంతిని తీసుకురావడానికి మనం సహాయపడగల ఉత్తమ మార్గం అంతర్గత శాంతిని పెంపొందించుకోవడం. సర్వోన్నత గురువు చింగ్ హై నిరంతరం ఇతరులకు ఇవ్వడానికి, ప్రేమించడానికి, ఆశీర్వదించడానికి జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆమె ఎప్పుడూ ప్రజలను విరాళాలు అడగదు, నిజానికి వాటిని తిరస్కరిస్తుంది. ఆమె తన అద్భుతమైన సృజనాత్మకత ద్వారా, ప్రపంచవ్యాప్తంగా విపత్తు బాధితుల కోసం లెక్కలేనన్ని ప్రభావవంతమైన సహాయక కార్యక్రమాలకు నిధులు సమకూర్చగలుగుతున్నారు, మరియు పిల్లలు, ఖైదీలు, వృద్ధులు, మరియు బలహీనులకు ఉపయోగకరమైన బహుమతులను అందిస్తున్నారు. ఆమె ఆచరణ రూపంలో ఉన్న ప్రేమ. వ్యక్తిగతంగా, ఆమె ఆభరణాలు మరియు వస్త్రాల రూపకల్పనలో, ఆమె ఉపన్యాసాలలో, కథలలో, హాస్యాలలో, ఆమె చిత్రలేఖనాలలో, సంగీతంలో మరియు ఇతర సృజనలలో కనబడే అపారమైన సృజనాత్మక ప్రతిభను చూసి నేను తరచుగా ఆశ్చర్యపోతుంటాను. ఆమె తన ఉత్సాహవంతులైన విద్యార్థుల సహాయంతో 30కి పైగా భాషలలో అనేక రకాల పుస్తకాలు, సీడీలు, డీవీడీలు మరియు పత్రికలను ప్రచురిస్తున్నారు. ఆమె స్ఫూర్తితో నడుస్తున్న ఆ టీవీ ఛానెల్ ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. అది ఒకేసారి 15 భాషలలో 24/7 ప్రసారం చేస్తూ, నిర్మాణాత్మక వార్తలకు మరియు మన ప్రపంచానికి స్వస్థత, శాంతి, జ్ఞానం, సౌందర్యాన్ని తీసుకురావడానికి లెక్కలేనంత మంది ప్రజలు అనేక విధాలుగా కష్టపడుతున్నారనే ఉత్తేజకరమైన సత్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె బోధన యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అది కేవలం ఆధ్యాత్మికమైనది మరియు అతీతమైనది మాత్రమే కాకుండా, అత్యంత ఆచరణాత్మకమైనది కూడా. ఆమెకు ఇంతమంది ఉత్సాహభరితమైన మద్దతుదారులు లభించడం, మానవత్వంలో అంతర్లీనంగా ఉన్న కరుణకు, ధైర్యానికి నిదర్శనం. సమస్త ప్రజలకు, జంతువులకు మరియు భవిష్యత్ తరాలకు: తన ప్రేమ మరియు అవగాహనతో ఈ భూమిని ప్రకాశవంతం చేసే గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన సుప్రీమ్ మాస్టర్ చింగ్ హై గారిని మన సభకు స్వాగతించడం నాకు లభించిన గొప్ప గౌరవం. Master: అందరికీ నమస్కారం. మీకు శుభాకాంక్షలు. మరియు దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించు గాక. మీకు వినపడుతుందా? (అవును.) మంచిది. బహుశా మీరు నన్ను ఇప్పుడిప్పుడే చూడటం మొదలుపెట్టి ఉండవచ్చు, కానీ నేను మిమ్మల్ని ఇంతకాలం తెర వెనుక చూస్తూనే ఉన్నాను. మరియు ఈ రోజు ఇక్కడ విచ్చేసిన వెస్ట్ హాలీవుడ్ మేయర్, గౌరవనీయులైన జెఫ్ ప్రాంగ్ గారికి, మరియు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, మీడియా ప్రతినిధులు, మరియు విశిష్ట అతిథులందరికీ నేను నమస్కారాలు, శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. మీ తీరికలేని జీవితంలో మీ అమూల్యమైన సమయాన్ని కొంత కేటాయించి, ఈ సమావేశానికి హాజరై మీ మద్దతు, సలహాలు, ఆలోచనలు మరియు ఆశీర్వాదాలను అందించినందుకు ధన్యవాదాలు. గ్లోబల్ వార్మింగ్‌కు పరిష్కారాలను ప్రజలకు గుర్తుచేస్తూ కష్టపడి పనిచేయడం ద్వారా, బహుశా మనమందరం కలిసి ఈ గ్రహాన్ని కాపాడగలుగుతాము. మీకు మరొక్కసారి ధన్యవాదాలు, మరియు మీ గొప్ప సంకల్పానికి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించుగాక. మరియు దయచేసి కొనసాగించండి. నేను వినడానికే ఇక్కడ ఉన్నాను, అంతాసరే? హలో చెప్పాలనిపించింది. MC: Jane Velez-Mitchell: వావ్! సర్వోన్నత గురువుగారూ, మీకు చాలా ధన్యవాదాలు. మీ నుండి సమాచారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరియు నేను మీ స్వరాన్ని వింటున్నప్పుడు కూడా, మీరు ఆచరణలో ప్రేమ అని నేను గ్రహించగలను. ముఖ్య విషయఏమిటంటే మనం పరమేశ్వరుని నుండి వినగలుగుతున్నాము, మరియు అది చాలా కీలకమైనది. కాబట్టి అదే ప్రధాన విషయం. అందువల్ల, ఓ సర్వోన్నత గురువా, మీరు అక్కడ ఉన్నందుకు మేము మరొక్కసారి ఎంతో ఆనందిస్తున్నాము. మీరు ఎంతో చేశారు. వ్యక్తిగతంగా, నేను సీల్స్‌ను రక్షించడం లేదా ఫ్యాక్టరీ ఫారాలలో జంతు హింసను ఆపడం వంటి కారణాల కోసం సర్వోన్నత గురువుగారి, సహాయం కోరిన ప్రతిసారీ, ఆమె మరియు ఆమె అద్భుతమైన బృందం అత్యంత ఉదారతతో ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. మరియు ఆమె మనందరికీ ఒక అద్భుతమైన ఆదర్శం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి సుప్రీమ్ మాస్టర్‌కు జేజేలు పలుకుదాం. Master: ధన్యవాదాలు, జేన్. మీకు చాలా ధన్యవాదాలు. MC: Jane Velez-Mitchell: ఇప్పుడు, నేను మీకు ఒక నిజంగా అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. అతను ఒక కౌబాయ్. ఆయన వ్యవసాయ వ్యాపారంలోని అత్యంత విషపూరిత రహస్యాలను బహిర్గతం చేసి చరిత్ర సృష్టించారు. ముద్దుగా “మ్యాడ్ కౌబాయ్” అని పిలవబడే హోవార్డ్ లైమన్ తన వృత్తి జీవితమంతా యునైటెడ్ స్టేట్స్‌లోని అతిపెద్ద పశువుల దాణా వ్యాపారులలో ఒకరిగా గడిపారు, కానీ క్యాన్సర్‌తో పోరాటం అనే ఒక సంఘటన జరిగింది. మరియు అది అతడిని ప్రపంచం ఇప్పటివరకు చూసిన అత్యంత గళం విప్పే వేగన్ కార్యకర్తలలో ఒకరిగా మార్చింది. ఓప్రా షోలో కనిపించిన తర్వాత అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. మీకు బహుశా అది గుర్తుండే ఉంటుంది; ఇది ప్రపంచవ్యాప్తంగా మాంసం మార్కెట్లను కుదిపేసింది. మరియు అతను దాని గురించి అంతా మనకు చెప్పబోతున్నాడు. హోవార్డ్, మాతో మాట్లాడటానికి రా, ఎందుకంటే నువ్వే గొప్పవాడివి. నన్ను వేగన్‌గా మారేలా చేసింది మీరే. నేను పదేళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు నన్ను 'మీరు వీగన్' అని అడిగారు, దానికి నేను, "నేను కేవలం శాకాహారిని" అని చెప్పాను. మీరు “ద్రవ మాంసం” అని అన్నారు. అప్పటి నుండి నేను పాలు, పాల ఉత్పత్తులను ఎప్పుడూ ముట్టుకోలేదు. (బ్రవో!) Howard: చాలా ధన్యవాదాలు, జేన్. ఈ రోజు మనం గంటకు 200 మైళ్ల వేగంతో కొండ అంచును సమీపిస్తున్నాము. రాజకీయ నాయకులు, అధికారులు, “చింతించకండి” అని మాట్లాడుతున్నారు. కొండ అడుగున ప్రాణాలతో మిగిలిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించబోతున్నారు. నేనాలుగో తరరైతును, పశువుల పెంపకం దారుడిని, పశువుల పెంపక కేంద్రాన్ని నడిపే వాడిని. నేను ప్రపంచమంతటా పర్యటిస్తూ, ప్రజల ఆహారంలో జంతు సంబంధిత ఉత్పత్తులు సున్నాగా ఉండాలని వారికి వివరిస్తాను. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నేను నా జీవితంలో 45 సంవత్సరాలు వ్యవసాయ ఉత్పత్తి రంగంలో గడిపాను. అమెరికాలో మనం ఈ రోజు మన పొలాల్లో, పశువుల క్షేత్రాల్లో చేస్తున్నది పూర్తిగా, సంపూర్ణంగా సుస్థిరత లేనిది. మనం మారాలి! నేను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పెరిగాను, మరియు మోంటానా రాష్ట్రంలోనే అతిపెద్ద సేంద్రీయ పాల ఉత్పత్తి కేంద్రం మాదే. మా తల్లిదండ్రులు పనివాళ్లను పెట్టుకోలేకపోయారు, దాంతో మా అమ్మ, నాన్న ఆవుల పాలు పితుకుతున్నారు. అంటే నన్ను మా తాతయ్య, బామ్మ పెంచారని అర్థం. అప్పట్లో ఊయలు, జారుడు బల్లలు లేదా లెగో బ్లాక్‌లు అనేవి ఉండేవి కావు. అప్పట్లో, డేకేర్ అంటే తోటలో పనిచేయడం. ఐదేళ్ల వయసులో నా మొదటి ఉద్యోగం తోటలో పనిచేయడం. పక్షులు, చెట్లు మరియు సారవంతమైన నేల – అదొక ఏదేను తోట అని నేను అనుకున్నాను. నేను ఎప్పుడూ రైతు అవ్వాలని మాత్రమే కోరుకున్నాను. నేను రైతు అవుతానని నాకు తెలుసు కాబట్టి, నా జీవితంలోని మొదటి 12 సంవత్సరాలు పార్టీలు చేసుకోవడం, ఫుట్‌బాల్ ఆడటం తప్ప మరేమీ చేయలేదు. మరియు నేను ఆ వ్యవసాయ క్షేత్రానికి, అంటే నడపాల్సిన ఆ వ్యాపారానికి వెళ్ళినప్పుడు, నా దగ్గర వ్యాపారాన్ని నడపడానికి కావలసిన పనిముట్లు లేవు. నేను ఒక స్తంభం కన్నా మూర్ఖుడిని. నేను ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. చాలామంది మంచి అమెరికన్ యువకులు చేసే పనే నేను చేశాను (చేస్తుంది). (తర్వాత) 12 ఏళ్లు బడికి వెళ్లినా ఏమీ నేర్చుకోలేకపోయిన, నేను వెంటనే విశ్వవిద్యాలయానికి వెళ్లాను. నేను వ్యవసాయ వ్యాపారవేత్త కావాలనుకున్నందుకే విశ్వవిద్యాలయానికి వెళ్లాను. ఇప్పుడు నేను దాన్ని పలకలేకపోయినా, అదే అవ్వాలని నాకు తెలుసు. నేను కలుపు సంహారకాలు, పురుగుమందులు, హార్మోన్లు మరియు మందుల గురించి ఒక విషయం నేర్చుకున్నాను. నేను దాన్ని స్పాంజిలా పీల్చుకున్నాను. నేను ఇంటికి వెళ్లి ఆ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకుని దానిని ఒక వ్యవసాయ వ్యాపారంగా మార్చాలనుకున్నాను. నేను వ్యవసాయంలో డిగ్రీ పట్టా పొందాను. నేను ఇంటికి వెళ్లి మా నాన్నతో, “నాన్నా, పక్కకు జరగండి” అన్నాను. నేను ఈ ఒక్క-గుర్రం వ్యాపారాన్ని తీసుకోబోతున్నాను మరియు నేను దానిని ఒక వ్యవసాయ వ్యాపారంగా మార్చబోతున్నాను.” అప్పుడు అతను, “అసలు అది ఏమిటి?” అని అన్నాడు. అప్పుడు నేను అతనితో, “రసాయన శాస్త్రం ద్వారా మెరుగైన జీవితం గురించి మీరు ఎప్పుడూ వినలేదా?” అని అన్నాను. "కాదు, ప్రకృతితో కలిసి పనిచేయడమే మన పని" అని ఆయన అన్నారు. నేన, “అది పాత పద్ధతి” అన్నాను. ఆకలితో ఉన్న ప్రపంచానికి ఆహారం అందించడమే మన పని. కలుపు సంహారకాలు, పురుగుమందులు, హార్మోన్లు మరియు మందులు వంటి నాకు నచ్చని రసాయనం అంటూ ఏదీ తారసపడలేదు. నేను ఆ ఒక్క గుర్రం ఉన్న ఫామ్‌ను తీసుకుని, కొన్నేళ్ల కాలంలో దానిని 7,000 పశువులు ఉండే స్థాయికి మార్చాను. నేను మొదటిసారిగా పది లక్షల డాలర్ల చెక్కు రాసి, అది బౌన్స్ అవ్వనప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అప్పుడు నేను, “అబ్బా, నేను గమ్యాన్ని చేరుకున్నాను అని అనుకున్నాను. నేను వ్యవసాయ రంగానికి డొనాల్డ్ ట్రంప్‌ని.” కానీ నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్న సమయంలో, నాకు కనువిప్పు కలిగింది. చివరికి నా నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. నా వెన్నుపాము మీద ఒక కణితి ఉండేది, దాని గురించి డాక్టర్ నాతో, “ఆ కణితి వెన్నుపాము లోపలి భాగంలో ఉంటే, నువ్వు మళ్ళీ నడవగల అవకాశం పది లక్షల్లో ఒకటి కన్నా తక్కువ అని చెప్పారు.” ఎవరైనా మీకు పది లక్షల్లో ఒక అవకాశం ఉందని చెబితే, వాళ్ళు మీతో చెప్పేదేమంటే, “హే, నీకు నచ్చిన వీల్‌చైర్‌ను ఎంచుకో, నీ మిగిలిన జీవితమంతా నువ్వు దానిలోనే ఉండబోతున్నావు.” నేను ఇక్కడ ఆపరేషన్ కోసం ఎదురుచూస్తున్నాను, నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి. అది ఒక్కొక్కటి $100,000 చొప్పున ఏడు కంబైన్లను, లేదా 20 ట్రాక్టర్లను లేదా 30 ట్రక్కులను సొంతం చేసుకోవడం గురించి కాదు. నేను రైతుగా ఎందుకు అయ్యానంటే, నా మనసులో మెదిలిన ఆలోచనలు ఇవే: పక్షులు, చెట్లు మరియు సారవంతమైన నేల. పక్షులు చనిపోవడం, చెట్లు చనిపోవడం చూశాను. నేల మారడం నేను చూశాను. నేను పక్షవాతానికి గురైన (అది) తర్వాతే, నేనే సమస్య అని, పరిష్కారం కాదని ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాను. వారు నాకు 12 గంటల పాటు ఆపరేషన్ చేసి, నా వెన్నెముక వెనుక భాగంలోని ఎముకను కత్తిరించారు. అనుకున్నట్లే, కణితి వెన్నుపాము లోపలి భాగంలో ఉంది. వారు తాడుపై ఉన్న కవచాన్ని చీల్చారు. అది లోపల ఉండటమే కాకుండా, తాడు కింద కూడా ఉంది. వారు కణితి వద్దకు చేరుకోవడానికి తాడును పైకి ఎత్తలేకపోయారు. వాళ్ళు చేయగలిగిందల్లా ఒక నరాన్ని పట్టుకుని, దాన్ని కోయడమే. వారు నా బొటనవేలు పరిమాణంలో ఉన్న కణితిని తొలగించారు. లక్షలో ఒకరికి జరిగే అరుదైన ఆపరేషన్‌తో నేను ఆసుపత్రి నుండి బయటకు వచ్చాను. (వావ్.) కానీ నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను బయటకు వచ్చేసరికి పూర్తిగా వేరే వ్యక్తిగా మారిపోయాను. (వావ్.) అది ఎక్కువ భూమి, ఎక్కువ పశువులు లేదా ఎక్కువ పరికరాల గురించి కాదని నాకు తెలుసు. కేవలం పెద్దగా, ధనవంతులుగా ఉండటం కంటే అందులో ఇంకా చాలా ఉంది. నేను నా బ్యాంకర్ దగ్గరికి వెళ్లి, “నాకు మీ సహాయం కావాలి. మనం ప్రకృతితో కలిసి వ్యవసాయం మొదలుపెట్టాలి” అని చెప్పాను.” నా బ్యాంకర్ కుర్చీలో వెనక్కి వాలి, “అసలు దీని అర్థం ఏమిటి?” అని అన్నాడు. “మనం సేంద్రియ రైతులుగా మారాలని నేను అనుకుంటున్నాను” అని అన్నాను. Photo Caption: "సూర్యుడిలా ప్రవర్తించడానికి, సూర్యుడిలా కనిపించడానికి మన శాయశక్తులా ప్రయత్నించడం ద్వారా ఆ సూర్యుడికి కృతజ్ఞత చాటడం ! “











